
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఒక మాస్ అండ్ ఎంటర్టైనింగ్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది చిరంజీవి కెరీర్‌లో 157వ చిత్రం కావడం విశేషం. ఇప్పటివరకూ ఈ సినిమా గురించి ఏ అప్డేట్ లేకపోయినా… మేకర్స్ ప్లాన్ చేసిన ప్రామోషన్ స్ట్రాటజీ ఇప్పుడు వేడి పెంచుతోంది.
ఇప్పటికే అనీల్ రావిపూడి తన మార్క్ హ్యూమర్‌తో ఈ సినిమా కోసం ఆసక్తికరమైన స్క్రిప్ట్ రెడీ చేశారట. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ గ్లింప్స్ మరియు ఫస్ట్ లుక్‌ను ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. అనీల్ లాక్ చేసిన టైటిల్ మెగా అభిమానులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. చిరంజీవితో ఆమె స్క్రీన్‌పై తిరిగి కనిపించడం ఇది చాలా సంవత్సరాల తర్వాత. వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దీనికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆయన ఇప్పటికే ఈ సినిమా కోసం పవర్‌ఫుల్ సాంగ్స్ కంపోజ్ చేస్తున్నట్టు సమాచారం.
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. మాస్, కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా కలిపిన స్టోరీతో ఈ మూవీ రూపొందుతోందని తెలుస్తోంది. చిరు అభిమానులకు ఇది మంచి ఫ్యామిలీ ట్రీట్ అవుతుందని యూనిట్ బలంగా నమ్ముతోంది. ఇదిలా ఉంటే చిరు బర్త్‌డే రోజు మరోవైపు విశ్వంభర టీజర్ కూడా విడుదల కానుంది.