
బిగ్ బాస్ సీజన్ 9 తుది దశకు చేరుకుంది. ఫినాలే వారంలో భాగంగా టాప్ 5 కంటెస్టెంట్స్ తమ 100 రోజుల ప్రయాణాన్ని చూసుకుని ఎమోషనల్ అవుతున్నారు. బుధవారం ఎపిసోడ్‌లో ప్రసారమైన ఇమ్మాన్యుయెల్ జర్నీ వీడియో ఇప్పుడు ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.
“హౌస్ లోకి ఒక కమెడియన్ గా అడుగుపెట్టావ్.. కానీ ఇప్పుడు ఒక హీరోగా బయటకు వెళ్తున్నావ్” అంటూ బిగ్ బాస్ చెప్పిన మాటలు ఇమ్మాన్యుయెల్ తో పాటు ఆడియన్స్ ను కూడా కదిలించాయి.
అమ్మకి ఇచ్చిన మాట నెరవేర్చానన్న ఆనందం ఇమ్మాన్యుయెల్ కళ్ళలో స్పష్టంగా కనిపించింది. ఈ సీజన్ లో కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా, అత్యధిక టాస్కులు గెలిచిన ప్లేయర్ గా ఇమ్మాన్యుయెల్ తన సత్తా చాటాడు. న
వ్వించడమే కాదు, సీరియస్ గేమ్ ఆడటంలోనూ తను ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకున్నాడు. అందుకే బిగ్ బాస్ ఆయన్ని స్టార్ ప్లేయర్ గా అభివర్ణించారు.
ప్రస్తుతం హౌస్ లో తనూజ, కళ్యాణ్, డీమాన్ పవన్, సంజన వంటి గట్టి పోటీదారులు ఉన్నారు. టైటిల్ రేసులో ఇమ్మాన్యుయెల్ మూడో స్థానంలో ఉన్నాడని ప్రచారం జరుగుతున్నా, చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చు. తక్కువ సార్లు నామినేషన్స్ లోకి రావడం వల్ల ఓటింగ్ పరంగా కొంత వెనుకబడ్డాడనే వాదన కూడా ఉంది.
