Monday, May 18, 2026
HomeMovie Newsబాలయ్య మళ్లీ డ్యూయల్ రోల్? గోపీచంద్‌ పాన్-ఇండియా ప్లాన్!

బాలయ్య మళ్లీ డ్యూయల్ రోల్? గోపీచంద్‌ పాన్-ఇండియా ప్లాన్!

balakrishna-nbk111-gopichand-malineni-dual-role-rumor

‘వీరసింహారెడ్డి’ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబో మళ్లీ సెట్ అయింది. NBK 111గా రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ‘అఖండ 2’తో వస్తున్న పాన్-ఇండియా బజ్‌ను కంటిన్యూ చేసేలా, గోపీచంద్ ఈ చిత్రాన్ని హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రాజస్థాన్‌లో లొకేషన్ల వేట కూడా మొదలైంది.

‘వీరసింహారెడ్డి’లో బాలయ్య ద్విపాత్రాభినయం, ముఖ్యంగా ఫ్యాక్షన్ లీడర్ పాత్ర ఫ్యాన్స్‌కు పూనకాలిచ్చింది. ఇప్పుడు NBK 111లో కూడా బాలయ్య డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారని గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఈసారి రెండు పాత్రలూ ఒకదానిని మించి ఒకటి పవర్‌ఫుల్‌గా ఉంటాయని సమాచారం.

ఈ చిత్రంతో బాలకృష్ణను పాన్-ఇండియా స్టార్‌గా నిలబెట్టాలని దర్శకుడు గోపీచంద్ పట్టుదలగా ఉన్నారు. అందుకే కేవలం మాస్ అంశాలకే పరిమితం కాకుండా, కంటెంట్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. హిస్టారికల్ టచ్ ఉండటంతో, ఇది జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం కాస్టింగ్ పనులు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 2026 చివరిలో లేదా 2027 సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’తో హిట్టిచ్చిన దర్శకుడు కావడంతో నందమూరి అభిమానులు ఈ కాంబోపై పూర్తి నమ్మకంతో ఉన్నారు.

‘అఖండ 2’ విడుదలైతే, బాలకృష్ణ పూర్తి ఫోకస్ ఈ ప్రాజెక్ట్‌పైనే పెట్టనున్నారు. ఇదిలా ఉండగా, NBK 112గా ‘ఆదిత్య 999’ కూడా చర్చల్లో ఉంది. మొదట బాలయ్య స్వీయ దర్శకత్వం అనుకున్నా, ఇప్పుడు ఆ బాధ్యతలను క్రిష్‌కు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular