
వరుసగా ఐదు ఫ్లాపులతో (‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘ఈగల్’, ‘మిస్టర్ బచ్చన్’, ‘మాస్ జాతర’) మాస్ మహారాజా రవితేజ కెరీర్ డైలమాలో పడింది. ‘ధమాకా’ తర్వాత సరైన హిట్ లేకపోవడంతో, ఆయన అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ‘RT 76’ పైనే ఉన్నాయి.
ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుండగా, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో ఓ స్పెషల్ ఐటెం సాంగ్‌ను కూడా జోడించారు.
అయితే, ఈ స్పెషల్ సాంగ్ కోసమే ఇప్పుడు ‘ఖిలాడి’ హీరోయిన్ డింపుల్ హయతిని ఎంపిక చేయడం ఫ్యాన్స్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటైన ‘ఖిలాడి’లో డింపుల్ హీరోయిన్‌గా నటించింది.
ఆ సినిమా ఫలితం, అందులో ఆమె పాత్రపై వచ్చిన విమర్శల కారణంగా, ఫ్యాన్స్ ఆమెను ‘ఫ్లాప్ సెంటిమెంట్’గా చూస్తున్నారు. ఇప్పుడు మళ్లీ అదే హీరోయిన్‌ను ఐటెం సాంగ్ కోసం రిపీట్ చేయడంపై సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అయితే, రవితేజ, దర్శకుడు కిషోర్ తిరుమల మాత్రం ఈ సెంటిమెంట్లను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. డింపుల్ హయతి ఇప్పటికే ఈ పాట షూటింగ్‌లో జాయిన్ అయినట్లు సమాచారం.
