
అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలున్న దర్శకుడు జేమ్స్ కామెరూన్ అవతార్ 3 సినిమాపై ఇండియన్ ఆడియన్స్ ఆసక్తి చూపడం లేదు. తొలి పార్ట్ సంచలనం సృష్టించినా, రెండో పార్ట్ నిరాశపరచడంతో ఇప్పుడు మూడో పార్ట్‌ను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదనే చర్చ నడుస్తోంది.
అవతార్ వచ్చి 17 ఏళ్లు అవుతున్నా, ఆ మాయాజాలం గురించి మాట్లాడుకుంటారు. అయితే అవతార్ 2 ఆశించిన విజయాన్ని నమోదు చేయలేదు. ఆ పాజిటివ్ బజ్ కారణంగా ఓపెనింగ్స్ భారీగా నమోదైనా, లాంగ్ రన్ లో వసూళ్లు నిరాశపరిచాయి.
అవతార్ 3 కోసం హాలీవుడ్ ప్రేక్షకుల్లో హడావుడి మొదలైనా, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మాత్రం మినిమం బజ్ కూడా కనిపించడం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
సినిమా రిలీజ్‌కు మరో రెండు వారాలు మాత్రమే సమయం ఉంది. అయినా బాలీవుడ్ సినిమా రేంజ్‌లో కాదు కదా, కనీసం ఒక మీడియం రేంజ్ సినిమా స్థాయిలో కూడా ఓపెనింగ్స్ ఉండే అవకాశం లేదని బాక్సాఫీస్ వర్గాలు అంటున్నారు.
దీనికి కారణం.. రెండో పార్ట్ విషయంలో అసంతృప్తిగా ఉండటమే. ఈ నేపథ్యంలో ఇండియన్ మార్కెట్‌లో ప్రచారం చేస్తే బడ్జెట్ వృథా అనుకుని, ఫిల్మ్ మేకర్స్ లైట్ తీసుకున్నారేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
