Sunday, October 4, 2026
HomeAndhra Pradeshవైసీపీకి రివర్స్ షాక్.. ఫ్లాప్ అయిన 'డిజిటల్ బుక్' సంతకాల వేట!

వైసీపీకి రివర్స్ షాక్.. ఫ్లాప్ అయిన ‘డిజిటల్ బుక్’ సంతకాల వేట!

ycp-digital-book-koti-santakalu-campaign-failure-post-defeat

ఏపీ: కేవలం 11 స్థానాలకే పరిమితమైన వైసీపీ.. తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదు. పార్టీ అధినేత జగన్ పిలుపునిస్తున్న కార్యక్రమాలు ఏమాత్రం సక్సెస్ కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నాయకులకు వేధింపులు ఎదురైతే నమోదు చేసేందుకు ‘డిజిటల్ బుక్’ ను జగన్ ప్రారంభించారు. కానీ తొలి రెండు మూడురోజుల్లోనే.. వైసీపీ హయాంలో జరిగిన అక్రమలపైన ఫిర్యాదులు పెద్ద ఎత్తున వచ్చాయి.

మాజీ మంత్రి విడదల రజని తన ఇల్లు కారు ధ్వంసం చేయించారంటూ ఒకరు, గతంలో జరిగిన అక్రమాలపై మరికొందరు ఆధారాలతో సహా డిజిటల్ బుక్‌లో నమోదు చేశారు. అసలు కంటే కొసరు ఎక్కువ కావడంతో ఈ కార్యక్రమం మరుగునపడింది.

మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ‘కోటి సంతకాల’ కార్యక్రమం కూడా ఊపందుకోలేదు. నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో విఫలమైన కారణంగా రెండుసార్లు వాయిదా పడింది.

వాస్తవానికి ఇది వైసీపీకి అత్యంత కీలకమైన కార్యక్రమం. అయినప్పటికీ.. పార్టీలో గ్రౌండ్ లెవెల్‌లో పని చేసేవారు కరువవడంతో దీనికి పెద్దగా ఊపు రాలేకపోయింది. పార్టీలో నిరాశ నిస్పృహలే దీనికి ప్రధాన కారణం.

మొత్తంగా చూస్తే, డిజిటల్ బుక్ – కోటి సంతకాల కార్యక్రమాల వల్ల వైసీపీ సాధించింది ఏమీ లేదు. ప్రచారం తప్ప పార్టీ పుంజుకోవడానికి ఈ కార్యక్రమాలు ఏమాత్రం ఉపయోగపడలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular