
రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న స్పిరిట్ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. అయితే తొలి రోజే షూటింగ్ సెట్ నుంచి ప్రభాస్ పోలీస్ డ్రెస్ లో ఉన్న వీడియో లీక్ అయింది. ఇది రెబల్ ఫ్యాన్స్‌కు సూపర్ కిక్ ఇచ్చింది.
సాధారణంగా ఇలాంటి లీక్స్ డైరెక్టర్‌కు చిరాకు తెప్పిస్తాయి. కానీ సందీప్ వంగా మాత్రం ఈ లీక్‌పై అంత సీరియస్‌గా లేరట. “లీక్ అయితే అయ్యింది, అందులో ఏముంది?” అన్నట్టు చెప్పాడట. దీనివల్ల సోషల్ మీడియాలో మరింత డిస్కషన్ పెరుగుతుందని ఆయన భావిస్తున్నారట.
ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా తన కెరీర్‌లోనే మొదటిసారి యూనిఫాం ధరించనున్నారు. సందీప్ వంగా ఈ సినిమాను తన మార్క్ యాక్షన్ హింసతో డిఫరెంట్ సెటప్‌లో ప్లాన్ చేస్తున్నాడు.
యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. సౌత్ కొరియన్ నటుడు డాన్ లీని కూడా తీసుకురావాలన్న చర్చ జరుగుతోంది. స్పిరిట్ సినిమా 2027లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ లోపే స్పిరిట్ షూటింగ్ మొదలవడం ఫ్యాన్స్‌కు మరో సంతోషాన్ని ఇచ్చింది.
