
జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ డిసెంబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే విడుదలకు ముందే విదేశాల్లో పడిన ప్రీమియర్ షోల టాక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మొదటి రెండు భాగాలు 5 బిలియన్ డాలర్లు వసూలు చేసినా, పార్ట్ 3 పై వస్తున్న రివ్యూలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి.
విజువల్స్ అద్భుతంగా ఉన్నా కథలో పస లేదని కొందరు క్రిటిక్స్ పెదవి విరుస్తున్నారు. ప్రముఖ సైట్ రోటెన్ టొమాటోస్ ఈ చిత్రానికి 70% స్కోర్ ఇచ్చింది.
బిబిసి (BBC) 1/5 రేటింగ్ ఇచ్చి మరీ దారుణంగా విమర్శించగా, ది గార్డియన్ కూడా నిడివి ఎక్కువైందని అసహనం వ్యక్తం చేసింది. మరోవైపు ‘డెడ్‌లైన్’ వంటి సంస్థలు మాత్రం యుద్ధ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించాయి.
ఈ నెగిటివ్ రివ్యూలు రేపటి ఓపెనింగ్స్ పై ప్రభావం చూపుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. మరి భారీ విజువల్స్ నమ్ముకున్న కామెరూన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.
