
న్యూస్ డెస్క్: ASIA CUP: భారత్-పాక్ మ్యాచ్ రద్దు చేసే అవకాశం లేదు
ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ గురించి అనేక ఊహాగానాలు వచ్చినప్పటికీ, ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు లేవని స్పష్టం అవుతోంది. సెప్టెంబర్ 14న గ్రూప్ దశలో జరగనున్న ఈ పోరుకు సంబంధించిన షెడ్యూల్ బయటపడిన దగ్గర నుంచి, సోషల్ మీడియాలో అభిప్రాయాలు చర్చకు దారితీశాయి.
ప్రస్తుతానికి ఇది ద్వైపాక్షిక పోటీ కాకుండా, బహుళ దేశాలు పాల్గొనే టోర్నమెంట్ కావడంతో మ్యాచ్ రద్దు పై నిర్ణయం సులభం కాదని అధికార వర్గాలు తెలియజేశాయి. పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్‌లు ఆడకుంటే, దాయాది జట్టుకు లాభం కలుగుతుందని వారు అభిప్రాయపడ్డారు.
క్రీడా మంత్రిత్వ శాఖ అధికారికంగా బీసీసీఐ పై నియంత్రణ లేకపోయినా, బీసీసీఐ ప్రజా అభిప్రాయాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటుందో చూడాలని అంటున్నారు. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక మ్యాచ్‌లు మాత్రం జరిగే అవకాశం లేదని చెప్పారు.
ఇక డిఫెన్స్ నిపుణులు, మాజీ క్రికెట్ నాయకులు ఈ విషయం పై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ బహుళ దేశాల టోర్నమెంట్లలో మాత్రం మ్యాచ్‌లు జరుగుతాయి.
2008 తర్వాత భారత్ పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లకు దూరంగా ఉన్నా, ఐసీసీ టోర్నీల్లో మాత్రం తటస్థ వేదికలపై తలపడుతోంది.