Sunday, August 23, 2026
HomeNationalహరిద్వార్ ఆలయంలో తొక్కిసలాట.. కారణమిదే

హరిద్వార్ ఆలయంలో తొక్కిసలాట.. కారణమిదే

haridwar-manasa-devi-temple-stampede-tragedy-six-dead

న్యూస్ డెస్క్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట భక్తులందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ ఉదయం జరిగిన ఈ సంఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆలయ ప్రాంగణంలో హఠాత్తుగా జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడినట్టు స్థానిక అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదానికి విద్యుత్ తీగ తెగిపోయిందన్న పుకారు కారణమైందని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ స్పందిస్తూ, “కరెంట్ షాక్ పుకారే తొక్కిసలాటకు దారితీసింది. కానీ విద్యుత్ షాక్‌కు ఎలాంటి ఆధారాలు లేవు” అని తెలిపారు. ఘటనకు సంబంధించి మెజిస్టీరియల్ విచారణను కూడా ఆదేశించారు.

శివాలిక్ కొండలపై ఉన్న ఈ ఆలయం హరిద్వార్‌కు వచ్చే భక్తులకి ముఖ్య పుణ్యస్థలంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి రోజూ వేలాది మంది భక్తులు ఇక్కడకు వచ్చే వేళ, ఇలాంటి ప్రమాదం చోటుచేసుకోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం చేసింది.

ప్రస్తుతం పోలీసులు, స్థానిక అధికారులు సంఘటన స్థలంలో సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. భద్రత చర్యలను మరింతగా కట్టుదిట్టం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. భక్తుల కోసం ఆలయంలో భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular

MalCare WordPress Security Plugin - Malware Scanner, Cleaner, Security Firewall Firewall

Blocked because of Malicious Activities

Reference ID: 17285523106a8b7186df36c