
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అలాగే, డైరెక్టర్ అనిల్ రావిపూడితో తెరకెక్కనున్న మెగా157 ప్రాజెక్ట్‌పై కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత చిరు స్ట్రాంగ్ లైనప్‌ను కొనసాగించాలని భావిస్తున్నాడు.
ఈ క్రమంలో చిరంజీవి మరోసారి దర్శకుడు బాబీ (కెఎస్ రవీంద్ర)తో కలిసి పనిచేయబోతున్నారని టాలీవుడ్ లో టాక్. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత ఈ జోడీ మరోసారి కలవడం ఫ్యాన్స్‌లో ప్రత్యేక ఆసక్తిని రేపుతోంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పక్కా అయినట్లు సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చే టైమ్‌లైన్‌పై కూడా ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. డైరెక్టర్ బాబీ ఈ ప్రాజెక్ట్‌ను 2025 సెప్టెంబరు నుంచి ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. కథకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ అయిందట. సినిమాటోగ్రఫీ బాధ్యతలు కార్తిక్ ఘట్టమనేని చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
ఈసారి చిరు కోసం బాబీ కొత్త తరహా కథను రెడీ చేస్తున్నాడని టాక్. మాస్, ఎమోషనల్ టచ్ మేళవించిన కథగా ఉండబోతుందని వినికిడి. చిరంజీవి లుక్, స్టైల్, కామెడీ టైమింగ్‌కు బాబీ దర్శకత్వం మరోసారి సరిగ్గా సరిపోతుందా అనే ఆసక్తి మిగిలింది.
