Friday, January 16, 2026
HomeMovie News'ఫస్ట్ లీడ్' అనొద్దు.. అనుపమకు నచ్చని 'హీరోయిన్ల' విభజన!

‘ఫస్ట్ లీడ్’ అనొద్దు.. అనుపమకు నచ్చని ‘హీరోయిన్ల’ విభజన!

anupama-parameswaran-slams-first-lead-second-lead-terminology

సినిమాలో హీరోయిన్లను ‘ఫస్ట్ లీడ్’, ‘సెకండ్ లీడ్’ అంటూ విభజించడం తనకు ఎంతమాత్రం నచ్చలేదని నటి అనుపమ పరమేశ్వరన్ స్పష్టం చేసింది. ఈ మధ్యకాలంలో ఈ అనవసరమైన పదాలు ఎక్కువ వినిపిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

పాత్రలో బలం మాత్రమే ముఖ్యమని, దాని నిడివికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పనిలేదని ఆమె అభిప్రాయపడింది. తన సినిమా ప్రేమమ్లో సాయిపల్లవి, మ‌డోన్నా, తాను… ముగ్గురం నటించామని, ఆ మూడు పాత్రలు కథకు సమానమని ఉదాహరణగా చెప్పింది.

మాలీవుడ్ నుంచి వచ్చిన అనుపమ సౌత్ అంతా చుట్టేసినా.. స్టార్ లీగ్‌లో చేరలేకపోయింది. ఆమె కెరీర్‌లో సెకండ్ లీడ్స్, కీలక పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే, హీరోయిన్‌గా రాని గుర్తింపు ఆ క్యారెక్టర్ రోల్సే తీసుకొచ్చాయి.

ఆరంభంలో గ్లామర్ పాత్రలకు నో చెప్పడంతో కెరీర్ నెమ్మదించినా.. తర్వాత డిఫరెంట్ జానర్ చిత్రాలు ఆమెకు అవకాశాలు దక్కేలా చేశాయి. లక్కీగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న ఆమె ఈ ఏడాది ఇప్ప‌టికే ఆరేడు సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించింది.

డ్రాగన్, కిష్కిందపురి, బైసన్ లాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి. నిడివి ముఖ్యం కాదు, పాత్రకున్న విలువ మాత్రమే ముఖ్యం అనే అనుపమ మాటలు ఇండస్ట్రీలో చర్చకు దారితీశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular