Tuesday, May 12, 2026
HomeMovie Newsవిజయ్ ఆడియో లాంచ్.. మలేషియాకు షిఫ్ట్!

విజయ్ ఆడియో లాంచ్.. మలేషియాకు షిఫ్ట్!

thalapathy-vijay-jana-nayagan-audio-launch-malaysia-political-tension

దళపతి విజయ్ చిట్ట చివరి సినిమా ‘జననాయగన్’ సంక్రాంతి 2026 బరిలో దిగనుంది. ఈ సినిమా ఆడియో రిలీజ్ వేదిక అందరినీ ఆశ్చర్యపరిచింది. చెన్నైలో కాకుండా, ఏకంగా దేశం దాటి మలేషియాలోని కౌలాలంపూర్‌కు ఈ వేడుకను షిఫ్ట్ చేశారు.

ఈ నిర్ణయానికి ప్రధాన కారణం రాజకీయ జోక్యమే. గతంలో విజయ్ రాజకీయ ఈవెంట్‌ల సమయంలో తొక్కిసలాట జరిగింది. అందుకే, విజయ్ పూర్తిగా రాజకీయాల్లోకి వస్తున్న (TVK పార్టీ) నేపథ్యంలో, తమిళనాడు ప్రభుత్వం ఇక్కడ భారీ ఈవెంట్‌లకు అనుమతి ఇవ్వడం లేదు.

ఇది విజయ్ సినీ కెరీర్‌కు చివరి ఆడియో ఈవెంట్ కావడంతో ఫ్యాన్స్ అత్యంత భావోద్వేగంలో ఉన్నారు. డిసెంబర్ 27న జరగనున్న ఈ వేడుకకు #OneLastDance అంటూ మలేషియా ఫ్యాన్స్ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. అక్కడి ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటే ఎమోషన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ ఈవెంట్ కౌలాలంపూర్‌లోని బుకిట్ జలీల్ స్టేడియంలో జరగనుంది. విదేశీ గడ్డపైనా విజయ్‌కి ఉన్న క్రేజ్‌ని నిరూపించడానికి ఇది ఒక వేదిక కానుంది. ఈ సినిమాలో విజయ్‌తో పాటు బాబీ డియోల్, పూజా హెగ్డే వంటి స్టార్స్ నటిస్తున్నారు.

అధికారపక్షం కుయుక్తులు పన్నుతున్నందున, రాజకీయ సమస్యలు రాకుండా ఉండేందుకు విజయ్ టీమ్ ఈ నిర్ణయం తీసుకుంది. దళపతి విజయ్ సినీ ప్రయాణంలో ఇది చివరి అధ్యాయం కావడం వలన ఈ ఆడియో వేడుక చాలా కీలకం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular