
ఈ మధ్య కాలంలో అన్ని రంగాల్లో AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సంగీత ప్రపంచంలో కూడా అది అడుగుపెట్టింది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తాజాగా తన పాటల్లో చాట్‌జీపీటీని వాడుతున్నట్టు వెల్లడించి ఆశ్చర్యానికి గురి చేశాడు.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అనిరుధ్, “ఒక పాట కంపోజ్ చేస్తున్నప్పుడు చివరి రెండు లైన్ల దగ్గర నిలిచిపోయాను. ఏ కొత్త ఐడియా రాలేదు. అప్పుడు నేను చాట్‌జీపీటీని వాడాను” అని చెప్పాడు. ప్రీమియం వెర్షన్‌ను సబ్‌స్క్రయిబ్ చేసి, ముందు లైన్లు ఇచ్చి మిగతా భాగానికి సజెషన్ అడిగానని తెలిపారు.
చాట్‌జీపీటీ తనకు అనేక ఆప్షన్లు ఇచ్చిందని అనిరుధ్ చెప్పడం వలన, ఏఐ వినియోగం ఇప్పుడు టెక్నీషియన్లు ఎలా ఉపయోగిస్తున్నారో తెలియజేస్తోంది. అయితే అతను ట్యూన్ కోసం అడిగాడా, లేక లిరిక్స్ కోసం అడిగాడా అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
సోషల్ మీడియాలో ఈ విషయంపై విపరీతమైన చర్చ మొదలైంది. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈ టెక్నాలజీపై ఆధారపడుతుంటే, భవిష్యత్తులో సంగీత సృష్టిలో ఏఐ పాత్ర ఎంత బలంగా ఉంటుందో ఊహించవచ్చు.
ఇది చూసి, కొంతమంది యువ మ్యూజిక్ లవర్స్.. ఏఐ సాయంతో తామూ పాటలు తయారుచేయగలమన్న ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు.