Friday, March 13, 2026
HomeMovie Newsకొరటాల నిశ్శబ్దం వెనక రహస్యమేంటి? తారక్ తర్వాత ఎవరు హీరో?

కొరటాల నిశ్శబ్దం వెనక రహస్యమేంటి? తారక్ తర్వాత ఎవరు హీరో?

koratala-siva-next-film-rumours-after-devara-delay-and-akkineni-connection

హిట్ స్ట్రీక్‌తో ఓ వెలుగు వెలిగిన కొరటాల శివ, ఆచార్య ప్లాప్ తర్వాత ఒత్తిడిలోనో, ఆలోచనలోనో నిశ్శబ్దంగా ఉన్నారు. ఎన్టీఆర్‌తో దేవర చిత్రాన్ని డీల్ చేసినా, సినిమా విడుదలై దాదాపు పది నెలలు కావస్తున్నా ఆయన కొత్త ప్రాజెక్టుపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

తారక్ ప్రస్తుతం వార్ 2డ్రాగన్ చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల దేవర 2 వెంటనే మొదలయ్యేలా కనిపించడం లేదు. దీనితో కొరటాల శివ ఇక కొత్త హీరో కోసం వెతుకులాటలో ఉన్నట్టు టాక్. అయితే టాప్ స్టార్స్ అందరూ ఇప్పటికే ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, కొరటాల చూపు అక్కినేని కాంపౌండ్ వైపు వెళ్లిందని వినిపిస్తోంది.

అఖిల్ ఇప్పటికే లెనిన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆయన స్థాయి, కొరటాల కంటెంట్ స్థాయి కలవాలంటే టైం పడుతుంది. దీంతో నాగార్జున లేదా నాగచైతన్యలో ఎవరికైనా కొరటాల కథ చెప్పినట్టుగా ఫిల్మ్ నగర్‌లో ప్రచారం జరుగుతోంది.

నాగ్ వందో సినిమాకి ఇప్పటికీ డైరెక్టర్ ఖరారు చేయలేదు. అయితే కొరటాల శివ ఆ ప్రాజెక్ట్‌ను తన చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు.

ఇంతకాలం గ్యాప్ తీసుకున్న కొరటాల ఇప్పుడు కొత్త కథతో పునరాగమనం చేస్తారా? లేక మరో మెగా డీల్ వేచి చూస్తున్నారా అన్నది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular