
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తన లైన్ప్ సినిమాలతో హైప్ పెంచుతున్నాడు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ AA22 చేస్తుండగా, మరోవైపు త్రివిక్రమ్‌తో మైతలాజికల్ కథపై చర్చలు జరుపుతున్నాడు. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ బన్నీ చుట్టూ చక్కర్లు కొడుతోంది.
ఒకప్పటి టీవీ సీరీస్ ‘శక్తిమాన్’ ఆధారంగా అల్లు అర్జున్ సినిమా చేయనున్నారనే టాక్ నెట్టింట వైరల్ అవుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉండగా, దర్శకత్వ బాధ్యతలు మలయాళ డైరెక్టర్ బేసిల్ జోసెఫ్ తీసుకుంటారని సమాచారం.
బేసిల్ ఇటీవల బన్నీని కలిసి కథ చెప్పగా, ఆ కథ బన్నీకి బాగా నచ్చిందట. అయితే ప్రస్తుతం ఒక్క సిట్టింగ్ మాత్రమే జరగడం, ఇంకా ఫైనల్ డిసిషన్ తీసుకోలేదన్నది ఇంట్రెస్ట్ పెంచుతోంది. ఒకవేళ శక్తిమాన్ కాన్సెప్ట్ ముందుకు సాగకపోతే, బేసిల్ చెప్పిన మరో కథ కూడా రేసులో ఉందట.
శక్తిమాన్ పాత్రలో బన్నీ నటిస్తే అది ఆయన కెరీర్లో ఓ ప్రయోగాత్మక దశగా నిలిచే అవకాశం ఉంది. సూపర్‌హీరో కాన్సెప్ట్‌ను ఇండియన్ స్క్రీన్‌పై హైలైట్ చేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందని టాక్.
అల్లు అర్జున్ చేస్తున్న సైన్స్ ఫిక్షన్, మైథాలజీ, సూపర్‌హీరో ప్రయోగాలు బాలీవుడ్‌తో పోటీపడే స్థాయిలో ఉండేలా ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
allu arjun new movie, shaktimaan remake, basil joseph director, geetha arts superhero film, pan india bunny project,