Thursday, June 18, 2026
HomeMovie Newsపెద్ది: చరణ్ సినిమా నుంచి నెవ్వర్ బిఫోర్ యాక్షన్ సీన్!

పెద్ది: చరణ్ సినిమా నుంచి నెవ్వర్ బిఫోర్ యాక్షన్ సీన్!

ramcharan-pedhi-hyderabad-action-schedule-update

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పెద్ది షూటింగ్ జోరుగా కొనసాగుతోంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో నెవ్వర్ బిఫోర్ లెవెల్ యాక్షన్ సీన్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సీన్‌కి ప్రముఖ కొరియోగ్రాఫర్ నబాకాంత్ మాస్టర్ నడిపిస్తున్నారు.

ఇటీవలి క్రికెట్ షాట్‌ ద్వారా వైరల్ అయిన నబాకాంత్ మాస్టర్.. ఇప్పుడు రెగ్యులర్ ఫైట్స్‌కి భిన్నంగా రామ్ చరణ్ కోసం ఓ గ్రాండ్ ఎపిసోడ్ రూపొందిస్తున్నారట. ఈ సన్నివేశం ఇండియన్ సినిమాల్లో మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందని యూనిట్ సమాచారం. కాగా, గత షెడ్యూల్‌లో బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కూడా కీలక సన్నివేశాల్లో పాల్గొన్నారు.

ఈ మూవీ కేవలం స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాకుండా, ఓ వ్యక్తి భావోద్వేగాల ప్రయాణంగా సాగనుంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, శివరాజ్ కుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. సంగీతానికి ఏఆర్ రెహమాన్ సారథ్యం వహిస్తున్నాడు.

ఒక స్పోర్ట్స్ మ్యాన్ జీవితంలోని అప్‌స్ అండ్ డౌన్స్, అతని స్ట్రగుల్స్, ఎమోషనల్ మూమెంట్స్ అన్నీ ఇందులో ఉండనున్నాయని మేకర్స్ వెల్లడిస్తున్నారు. ఫ్రేమ్ ఫ్రేమ్‌కి పర్ఫెక్షన్‌తో తెరకెక్కిస్తున్నారు.

ఈ భారీ విజువల్ ఎక్స్‌పీరియన్స్ మూవీని 2026 మార్చి 27న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అప్‌కమింగ్ రోజుల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ వెలువడనున్నాయి.

ramcharan, pedhi, buchibabu, janvikapoor, arrrahman,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular