
బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2: తాండవం’ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఈ సినిమా నిర్మాతలు రామ్ గోపి ఆచంట టికెట్ రేట్ల పెంపు ప్రీమియర్ షోలపై స్పందించారు.
సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టామని, మార్కెట్ కూడా బాగున్నందున టికెట్ రేట్ల పెంపు కచ్చితంగా ఉంటుందని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. అయితే అది ప్రేక్షకులు తిట్టుకునేలా ఉండకుండా రీజనబుల్‌గా మాత్రమే ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇటీవల కల్కి, పుష్ప వంటి సినిమాలకు రేట్లు భారీగా పెంచడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘అఖండ 2′ నిర్మాతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. జనం భయపడి థియేటర్‌కు రాకుండా ఉండకూడదని వారు భావిస్తున్నారు.
ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. అయితే సినిమా లాంగ్ రన్ కు ఫ్యామిలీ ఆడియన్స్ జనరల్ పబ్లిక్ టాక్ మాత్రమే ముఖ్యమని వారు అభిప్రాయపడ్డారు. ఫ్యాన్స్ షోలతో రికవరీ అయిపోతుందనే అపోహలో తాము లేమని తెలిపారు.
టికెట్ రేట్ల పెంపు డిస్ట్రిబ్యూటర్లతో చర్చించిన తర్వాతే నిర్ణయిస్తామని చెప్పారు. ఆడియన్స్ ను ఇబ్బంది పెట్టకూడదనే వారి బ్యాలెన్స్డ్ ఆలోచన మంచిదే. రికార్డులు బద్దలు కొట్టడం బాలయ్యకు కొత్తేమీ కాదు.
