
పుష్ప 2 సృష్టించిన రూ. 1700 కోట్ల సునామీ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆయన వేసే ప్రతి అడుగుపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం బన్నీ ఫోకస్ మొత్తం అట్లీ సినిమా మీదే ఉంది. ఇది కేవలం పాన్ ఇండియా కాదు, దాదాపు 700 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ‘పాన్ వరల్డ్’ ప్రాజెక్ట్. అట్లీ ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.
ఫ్యూచర్ లైనప్ విషయానికి వస్తే, త్రివిక్రమ్ శ్రీనివాస్ సందీప్ రెడ్డి వంగాతో సినిమాలు చేయబోతున్నట్లు అధికారిక ప్రకటనలు వచ్చాయి. ఈ రెండు కాంబినేషన్లు బాక్సాఫీస్ దగ్గర మినిమమ్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.
ఈ లిస్టులో ఇప్పుడు కోలీవుడ్ సెన్సేషన్ లోకేష్ కనకరాజ్ పేరు సడెన్ గా తెరపైకి వచ్చింది. వీరిద్దరి మధ్య చర్చలు తుది దశకు వచ్చాయని, ఏ క్షణమైనా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి బిగ్ అప్డేట్ రావచ్చని గట్టిగా టాక్ వినిపిస్తోంది.
సంజయ్ లీలా భన్సాలీ, ప్రశాంత్ నీల్ వంటి దిగ్గజాలు కూడా బన్నీ కోసం క్యూలో ఉన్నారు. ఆయన ప్లానింగ్ చూస్తుంటే.. తన తర్వాతి సినిమాలతో తానే రికార్డులు బద్దలు కొట్టుకునేలా పక్కా స్కెచ్ వేశారు.
