Friday, January 16, 2026
HomeMovie Newsవారంలోనే ఓటీటీలోకి వచ్చిన సినిమా.. కారణం పబ్లిసిటీనేనా?

వారంలోనే ఓటీటీలోకి వచ్చిన సినిమా.. కారణం పబ్లిసిటీనేనా?

panch-minar-raj-tarun-released-on-amazon-prime-within-one-week

టాలీవుడ్‌లో సినిమా రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీలోకి రావడం సాధారణం. కానీ, రాజ్ తరుణ్ నటించిన పాంచ్ మినార్మూవీ విడుదలైన కేవలం వారం రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రావడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.

క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో రాజ్ తరుణ్ లీడ్ రోల్ పోషించారు. రామ్ కుడుముల దర్శకత్వం వహించారు. రాజ్ తరుణ్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా బాగుందని, క్రిటిక్స్ నుంచి డీసెంట్ టాక్ వచ్చిందని అంటున్నారు.

సినిమా బాగున్నా, థియేటర్లలో మాత్రం నిలబడలేదు. దీనికి ముఖ్య కారణం పబ్లిసిటీ లేకపోవడమే. చాలా మందికి ఈ సినిమా రిలీజ్ అయిన విషయం కూడా తెలియదు. ప్రమోషన్స్ లేకపోవడం మూవీకి పెద్ద మైనస్ అయ్యింది.

థియేటర్లలో రెస్పాన్స్ లేకపోయినా, వారానికే ఓటీటీలోకి రావడం ఈ మధ్యకాలంలో బహుశా ఇదే తొలిసారి. ప్రమోషన్స్ ఖర్చు తగ్గించుకోవడానికి నిర్మాతలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

థియేటర్స్ లో నిలబడకపోయినా.. ఓటీటీలోకి వచ్చి హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. మరి ఓటీటీ ఆడియన్స్.. పాంచ్ మినార్ విషయంలో ఏం చేస్తారో చూడాలి. రాజ్ తరుణ్‌కు ఊరట లభిస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular