
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2: తాండవం’పై అంచనాలు ఆకాశాన్నంటున్నాయి. డిసెంబర్ 5న పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్లు ఊపందుకున్నాయి.
ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రాగా, ఇప్పుడు అందరి దృష్టీ ఫస్ట్ సింగిల్ “తాండవం సాంగ్”పై పడింది. ‘అఖండ’కు అద్భుతమైన BGM అందించిన తమన్, ఈ సీక్వెల్‌కు కూడా డివైన్, పవర్‌ఫుల్ మ్యూజిక్ అందించినట్లు ప్రోమోతోనే రుజువైంది.
ఈ పాటను దిగ్గజ గాయకులు శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ ఆలపించడం విశేషం. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఈ పాట ఫైనల్ మిక్సింగ్ పూర్తయిందని, ఫుల్ పవర్‌ఫుల్‌గా ఉంటుందని అప్‌డేట్ ఇచ్చారు.
అయితే, ఈ పాన్-ఇండియా సినిమా ప్రమోషన్లలో భాగంగా, మేకర్స్ తొలి అడుగును నార్త్‌లో వేస్తున్నారు. “తాండవం సాంగ్” లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో కాకుండా, ముంబైలోని జుహు పీవీఆర్ మాల్‌లో నిర్వహించనున్నట్లు తమన్ అధికారికంగా ప్రకటించారు.
పాన్-ఇండియా రేంజ్‌లో విడుదలవుతున్న ‘అఖండ 2′ ప్రమోషన్లను ముంబై నుంచి ప్రారంభించడం, సినిమాపై మేకర్స్‌కు ఉన్న నమ్మకాన్ని సూచిస్తోంది. ఈ పాట హిట్టయితే, సినిమాకు దేశవ్యాప్తంగా భారీ బజ్ రావడం ఖాయం.
