
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ (SSMB29) ఫీవర్ మొదలైంది. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న భారీ ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. ఈ వేడుకకు 50,000 మంది అభిమానులు హాజరవుతారని అంచనా.
ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను ‘జియో హాట్‌స్టార్’ దక్కించుకుంది. ఈ వేదికపై శ్రుతి హాసన్, ర్యాపర్ డివైన్ టైటిల్ ట్రాక్‌ను ప్రదర్శించనున్నారు. టీజర్‌ను రికార్డు స్థాయిలో 130×100 అడుగుల స్క్రీన్‌పై లాంచ్ చేయనున్నారు.
ఈవెంట్‌కు ముందు, హీరోయిన్ ప్రియాంక చోప్రా ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్‌లో ఓ సీక్రెట్ లీక్ చేసింది. రాజమౌళి సార్ సహాయంతో తాను తెలుగు స్పష్టంగా పలుకుతున్నానని, తన లైన్స్ తానే చెప్పుకుంటున్నానని వెల్లడించింది.
సాధారణంగా రాజమౌళి హీరోలు (ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్) సినిమా వివరాలు లీక్ చేయరు. కానీ ప్రియాంక ఇలా అప్‌డేట్స్ ఇవ్వడం సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతోంది.
మరోవైపు, ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో, ఇంత భారీ పబ్లిక్ ఈవెంట్‌కు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
ఎలాంటి అపశ్రుతులు జరగకుండా హై అలర్ట్‌తో భద్రతా చర్యలు చేపట్టినట్లు, వేదిక వద్ద భారీగా బలగాలను మోహరించనున్నట్లు సమాచారం.
