
న్యూస్ డెస్క్: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2: తాండవం’ కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు పీక్ స్టేజ్‌కి చేరాయి. అయితే సినిమా కంటే ఎక్కువగా ఇప్పుడు జరగబోయే ప్రీ-రిలీజ్ ఈవెంట్ గురించే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది.
ఈ ఈవెంట్‌కు గెస్ట్‌లుగా ఎవరు వస్తున్నారో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఒకరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాగా, మరొకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వీరిద్దరూ ఒకే వేదికపైకి రావడం ఇప్పుడు సెన్సేషన్‌గా మారింది. గతంలో వీరి మధ్య చిన్నపాటి గ్యాప్ ఉందన్న రూమర్స్ ఉండటంతో, ఇప్పుడు బాలయ్య సాక్షిగా ఆ సీన్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
అల్లు అర్జున్‌కి, అఖండ ఫ్రాంచైజీకి ఒక సెంటిమెంట్ లింక్ ఉంది. అఖండ పార్ట్-1 ఈవెంట్‌కు కూడా బన్నీనే గెస్ట్‌గా వచ్చారు, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో సీక్వెల్‌కి కూడా ఆయన్నే పిలిచారు. ‘అన్ స్టాపబుల్’ షో నుంచి బాలయ్య, బన్నీ మధ్య మంచి బాండింగ్ ఉంది. అందుకే పిలవగానే బన్నీ మరోసారి సందడి చేయడానికి రెడీ అయిపోయారు.
ఈ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో భారీ ఎత్తున నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు నవంబర్ 21న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ వెళ్తున్నారు. అక్కడ కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ గెస్ట్‌గా రానున్నారు. ఇలా రెండు రాష్ట్రాల్లోనూ అఖండ మోత మోగించేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు.
మొత్తానికి అటు పొలిటికల్ పవర్, ఇటు స్టార్ పవర్ కలవబోతున్న ఈ ఈవెంట్ సినిమాకి భారీ హైప్ తీసుకురావడం ఖాయం. రేవంత్, బన్నీ, బాలయ్య ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఫ్యాన్స్‌కు పండగే. డిసెంబర్ 5న థియేటర్లలో శివతాండవం చూడటానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు.
