Monday, May 18, 2026
HomeMovie Newsరామ్ 'ఆంధ్ర కింగ్’.. అసలు నిజం చూపిస్తాడా?

రామ్ ‘ఆంధ్ర కింగ్’.. అసలు నిజం చూపిస్తాడా?

ram-pothineni-andhra-king-thaloooka-movie-fans-emotion

న్యూస్ డెస్క్: ఈ రోజుల్లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఫ్యాన్ వార్సే కనిపిస్తాయి. రికార్డుల కోసం, కలెక్షన్ల కోసం బూతులు తిట్టుకోవడం కామన్ అయిపోయింది. “అసలు ఆ హీరోకి నువ్వు ఉన్నావని కూడా తెలియదు, ఎందుకురా ఇలా కొట్టుకుంటారు?” అని ఎగతాళి చేసేవాళ్ళూ ఉన్నారు. సరిగ్గా ఇలాంటి టైమ్‌లోనే ఫ్యానిజం వెనుక ఉన్న అసలైన ఎమోషన్‌ని చూపించడానికి వస్తోంది రామ్ పోతినేని సినిమా.

దర్శకుడు మహేష్ బాబు పి ఈ కథను తెలివిగా 2000 నాటి కాలంలో సెట్ చేశారు. అప్పట్లో సోషల్ మీడియా, ఫేక్ కలెక్షన్ల గొడవలు లేవు. కేవలం పేపర్ కటింగ్స్, థియేటర్ దగ్గర పండగ వాతావరణమే ఉండేది. ఆనాటి స్వచ్ఛమైన అభిమానాన్ని, ఆ నాస్టాల్జిక్ ఫీలింగ్‌ని ఈ సినిమా ద్వారా మళ్ళీ గుర్తుచేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ పాత్రలో రామ్ పరకాయ ప్రవేశం చేశారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. “వాడు ఉన్నాడని నాకు తెలియకపోవచ్చు, కానీ నేను ఒకడిని ఉన్నానంటే అది వాడి వల్లే” అనే డైలాగ్ ఫ్యాన్స్ ఎమోషన్‌ని పర్ఫెక్ట్‌గా పట్టుకుంది. కేవలం కటౌట్ మాత్రమే కాదు, హీరో అంటే ఒక ఎమోషన్ అని చాటిచెప్పేలా రామ్ నటన, ఎనర్జీ ఉన్నాయి.

కేవలం అభిమాని ప్రేమే కాదు, హీరోకి ఉండాల్సిన బాధ్యతను కూడా ఈ సినిమా ప్రశ్నిస్తోంది. ఉపేంద్ర పాత్ర ద్వారా.. తనను నమ్ముకున్న అభిమాని కోసం హీరో ఏం చేశాడు? అనే కొత్త కోణాన్ని టచ్ చేయబోతున్నారు. ఫ్యాన్స్ అంటే టికెట్ కొనే కస్టమర్లు కాదు, ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనే స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వనున్నారు.

సోషల్ మీడియా గొడవలతో విసిగిపోయిన వారికి ఈ సినిమా ఒక మంచి రిలీఫ్ అయ్యేలా ఉంది. ఇప్పటివరకు రాని ఈ యునిక్ పాయింట్ థియేటర్లో కనెక్ట్ అయితే, రామ్ కెరీర్‌లో ఇదొక స్పెషల్ మూవీగా నిలవడం ఖాయం. నవంబర్ 28న ఈ ఎమోషనల్ జర్నీ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular