
న్యూస్ డెస్క్: ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ భారీ ఆఫర్ ప్రకటించింది. ‘పే డే సేల్’ పేరుతో ప్రత్యేక రాయితీ టికెట్లు అందిస్తోంది. దేశీయ ప్రయాణాలకు టికెట్ ధర రూ.1,299 నుంచే ప్రారంభం కావడం ఈ ఆఫర్‌లో ప్రధాన ఆకర్షణ.
సెప్టెంబర్ 1 వరకు బుక్ చేసిన టికెట్లు 2026 మార్చి 31 వరకు ఉపయోగించుకోవచ్చు. ఎక్స్‌ప్రెస్ లైట్ టికెట్లు రూ.1,299 నుంచి, ఎక్స్‌ప్రెస్ వ్యాల్యూ టికెట్లు రూ.1,349 నుంచి లభిస్తాయి. అంతర్జాతీయ ప్రయాణాలకు మాత్రం ధరలు రూ.4,876 నుంచి ప్రారంభం అవుతాయని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది.
సభ్యుల కోసం అదనపు రాయితీలు కూడా ఉన్నాయి. యాప్ ద్వారా బుక్ చేస్తే కన్వీనియన్స్ ఫీజు మినహాయింపు, బ్యాగేజ్ ఛార్జీలపై ప్రత్యేక తగ్గింపులు లభిస్తాయి. దేశీయంగా 15 కిలోల బ్యాగేజ్, అంతర్జాతీయంగా 20 కిలోల బ్యాగేజ్‌పై తక్కువ ధరలకు అవకాశం కల్పించారు.
ప్రీమియం సౌకర్యాలు కోరుకునే ప్రయాణికుల కోసం ఎక్స్‌ప్రెస్ బిజ్ కేటగిరీలో 25 శాతం వరకు తగ్గింపులు ఇస్తున్నారు. ఈ బిజ్ క్లాస్‌లో విస్తారమైన సీట్లు, ఉచిత భోజనం, అధిక బ్యాగేజ్ అలవెన్స్ లభిస్తాయి.
అదనంగా, సభ్యులకు సీట్ సెలక్షన్, హాట్ మీల్స్, ప్రైయారిటీ సర్వీసులపై 20 శాతం రాయితీ ఉంటుంది. విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, సాయుధ దళాల సిబ్బందికి కూడా ప్రత్యేక రాయితీలు వర్తిస్తాయి.