
యువ హీరో తేజ సజ్జ నటించిన మిరాయ్ చిత్రం సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. రితిక నాయక్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. సూపర్ యోధుడి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం పట్ల టాలీవుడ్ ఆడియెన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాను సుమారు 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు సమాచారం. అయితే విడుదలకు ముందే ఓటిటి, శాటిలైట్ హక్కుల ద్వారా దాదాపు 45 కోట్ల రూపాయలు రాబట్టినట్టు తెలుస్తోంది. దీనితో మిగిలిన బిజినెస్ రికవరీ పెద్ద సమస్య కాని స్థితి కనిపిస్తోంది.
తేజ సజ్జ గతంలో హనుమాన్ వంటి విజయవంతమైన సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ క్రేజ్ మిరాయ్ కి కూడా మద్దతు ఇస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతే కాకుండా, ఈ సినిమా థియేట్రికల్ హక్కుల కోసం కూడా మంచి డిమాండ్ ఏర్పడినట్టు టాక్.
ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్‌గా కనిపించనున్నాడు. అతని రోల్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని యూనిట్ చెబుతోంది. గౌర హరి సంగీతం అందిస్తుండగా, యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా హైలైట్‌గా నిలవనున్నాయి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్ పరంగా కూడా చర్చనీయాంశమైంది. కంటెంట్ బలంగా ఉంటే బాక్సాఫీస్ వద్ద కూడా బంపర్ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని అనిపిస్తోంది.
