
స్పోర్ట్స్ డెస్క్:SRH: సీజన్ చివర్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు అదిరిపోయింది. ప్లే ఆఫ్స్ దాటిన ఆశలు మిగిలి లేనప్పటికీ, ప్రదర్శనలో ఏమాత్రం తగ్గలేదు. ఢిల్లీలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 110 పరుగుల భారీ తేడాతో గెలిచి హ్యాట్రిక్ విజయంతో ఐపీఎల్ 2025 సీజన్‌కు ఫుల్ స్టాప్ పెట్టింది.
మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి 278 పరుగుల భారీ స్కోరు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 105 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు (39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లు).
ట్రావిస్ హెడ్ (76) అద్భుతంగా ఆడగా, అభిషేక్ శర్మ (32), ఇషాన్ కిషన్ (29) సహాయమందించారు.
బౌలింగ్‌లో హైదరాబాద్ దూకుడే చూపింది. జయ్‌దేవ్ ఉనద్కట్, ఎషాన్ మలింగ, హర్ష్ దూబె చెరో 3 వికెట్లు తీసి కోల్‌కతాను 168 పరుగులకే కట్టేశారు. కేకేఆర్ బ్యాటర్లు నిరాశపరిచారు. నరైన్ (31), మణిష్ పాండే (37) తప్ప మరెవ్వరూ నిలవలేకపోయారు.
ఈ విజయంతో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకుని సీజన్ కు ఘన ముగింపు ఇచ్చింది. ఇదే సమయంలో కోల్‌కతాకు ఇది ఐపీఎల్లో అతిపెద్ద ఓటమిగా నమోదైంది.
క్లాసెన్ శతకం, హెడ్ మెరుపులతో సీజన్ ముగించుకున్న హైదరాబాద్ నెక్స్ట్ సీజన్ కు ఒక ధైర్యం ఇచ్చింది.