
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమా గ్రాండ్‌గా రేపు థియేటర్లలోకి రానుంది. మణిరత్నం దర్శకత్వం, త్రిష – అభిరామి లీడ్ రోల్స్‌తో రూపొందిన ఈ భారీ బడ్జెట్ చిత్రం విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది.
ప్రస్తుతం ఈ చిత్రం కన్నడలో విడుదల కానున్న పరిస్థితి లేదు. కమల్ హాసన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అక్కడ ఆగ్రహం వ్యక్తమవ్వడంతో థగ్ లైఫ్పై అడ్డుపడేలా మారిపోయింది. దీంతో ఈ సినిమాకు కనీసం రూ.15 కోట్ల నష్టం వచ్చినట్టు తమిళ సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
కన్నడలో ఒక వారం తర్వాత విడుదల చేసే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నప్పటికీ, ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవని తెలుస్తోంది. ఈ బ్యాన్ కారణంగా ఆ రాష్ట్ర డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ నుంచి ఆదాయం కోల్పోయే అవకాశముంది.
ఈ సినిమాకు సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందించగా, కమల్ హాసన్ – ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. సినిమా టెక్నికల్ గా హై స్టాండర్డ్‌గా ఉండబోతుందని బజ్.
ఒకవైపు భారీ స్థాయిలో రిలీజ్ – మరోవైపు ప్రాంతీయ వివాదాలు థగ్ లైఫ్ ట్రాక్‌ను ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి.
thuglife, kamalhaasan, maniratnam, kannadaban, trisha
