
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న కన్నప్ప సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాకు ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా, హీరో విష్ణు స్వయంగా సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చాడు.
తన తాజా ప్రమోషన్లలో కన్నప్ప సినిమా జూన్ 27న ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోకి రాబోతుందని విష్ణు స్పష్టంగా తెలిపారు. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఈవెంట్లు కూడా ప్లాన్ చేసినట్టు వెల్లడించారు.
ఈ పాన్ ఇండియా చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ కీలక పాత్రలో కనిపించనుండగా, ఆయన స్క్రీన్ టైమ్ సుమారు 30 నిమిషాలపాటు ఉండనుందని సమాచారం. ఇదే సినిమా బజ్‌కు భారీ బలంగా మారుతోంది.
కన్నప్ప చిత్రానికి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా, సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. విజువల్స్, యాక్షన్, డేవోషనల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా విభిన్నంగా ఉండనుందని టాక్.
ఈ నేపథ్యంతో జూన్ 27న థియేటర్లలో కన్నప్ప దేవుని కథను ఆధునికంగా, రిచ్ విజువల్ ట్రీటుగా చూడబోతున్నాం. అభిమానులకు ఇది ఒక స్పెషల్ జర్నీగా నిలవనుంది.
kannappa, manchuvishnu, prabhas, panindiamovie, june27release,