Monday, April 13, 2026
HomeMovie Newsరవితేజ సూపర్ హీరో అవతారం త్వరలోనే!

రవితేజ సూపర్ హీరో అవతారం త్వరలోనే!

raviteja-superhero-film-kalyanshankar-sitara

మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో కొత్త అధ్యాయానికి తెరలేపే ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభం కానుంది. యువ దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రవితేజ ఓ సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుండగా, కథ ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది.

కళ్యాణ్ శంకర్ గతంలో మ్యాడ్ సీరీస్‌తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు రవితేజకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ పాత్ర, పూర్తిగా భిన్నంగా ఉండనుందని సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా మొదటి భాగం విజయవంతమైతే, ఫ్రాంచైజీగా మరిన్ని పార్ట్స్ తెరకెక్కించాలనే యోచనలో ఉన్నారు. రవితేజ పాత్రలో అద్భుతమైన శక్తులు, హై లెవెల్ విఎఫ్ఎక్స్‌తో సినిమా టెక్నికల్‌గా కొత్త రేంజ్‌ను చేరనుందని తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. అధికారిక ప్రకటనను త్వరలోనే విడుదల చేయనున్నారు. రవితేజ అభిమానులు మాత్రం ఈ కొత్త అవతారంపై ఇప్పటికే హైప్ పెంచుతున్నారు.

ఇక మరోవైపు రవితేజ “మాస్ జాతర” సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ఈ సినిమా విడుదల తేదీ త్వరలోనే ప్రకటించనున్నారు.

 raviteja, superhero, kalyanshankar, sitaraentertainments, massjathara,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular