Wednesday, February 18, 2026
HomeNationalఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్: 8.25% వడ్డీ కొనసాగింపు

ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్: 8.25% వడ్డీ కొనసాగింపు

epf-interest-rate-2024-update

న్యూస్ డెస్క్: ఈపీఎఫ్ చందాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 8.25% వడ్డీ కొనసాగనుందని అధికారికంగా ప్రకటించింది.

ఇది గత ఏడాది వడ్డీ రేటుతో సమానమే కావడం విశేషం. 2023-24లోనూ చందాదారులకు ఇదే రేటు అమలులో ఉండింది. తాజా ప్రకటనతో దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 7 కోట్ల మంది ఈపీఎఫ్ సభ్యులకు లాభం చేకూరనుంది.

ఈ వడ్డీ రేటును ఇటీవల ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో సిఫారసు చేయగా, కేంద్రం ఆమోదం తెలిపింది.

ప్రభుత్వ ప్రకటన వెలువడిన నేపథ్యంలో, ఈపీఎఫ్‌ఓ త్వరలోనే వడ్డీ మొత్తాన్ని సభ్యుల ఖాతాల్లో జమ చేయనుంది.

సురక్షితమైన పొదుపు మార్గంగా ఉన్న ఈపీఎఫ్‌కు మరోసారి విశ్వసనీయత పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఇది ఆర్థికంగా ఉపశమనం కలిగించే వార్తగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular