
స్పోర్ట్స్ డెస్క్:KKR vs RCB: ఐపీఎల్ 2025 డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కి ఈ సీజన్ నిరాశను మిగిల్చింది. బెంగళూరులో జరిగిన ఆర్‌సీబీతో కీలక మ్యాచ్ వర్షార్పణం కావడంతో ప్లేఆఫ్స్ ఆశలు అడుగంటిపోయాయి.
తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌కు వర్షం అడ్డుకాగా, రెండు జట్లు చెరో పాయింట్ చొప్పున పంచుకున్నాయి. ఈ మ్యాచ్ రద్దవడంతో కేకేఆర్ ఖాతాలో 13 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లే మిగిలాయి.
ఒక మ్యాచ్ మిగిలి ఉన్నా గెలిచినా 14 పాయింట్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో, ప్లేఆఫ్స్‌కి చేరే అవకాశాలు క్లోజ్ అయ్యాయి. గత సీజన్ విజేతగా ఐపీఎల్‌లో బరిలోకి దిగిన కోల్‌కతా ఈసారి లీగ్ దశలోనే ఇంటికి వెళ్లడం విచారకరం.
మరోవైపు, 12 మ్యాచ్‌ల్లో 17 పాయింట్లు సాధించిన ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖరారు చేసుకుంది. దీంతో, ఈ సీజన్‌లో ఆర్‌సీబీ అత్యుత్తమ ఫామ్‌ను కొనసాగిస్తూ అగ్రస్థానంలో నిలిచింది. వర్షం అభిమానులను నిరాశ పరిచినా, ఆర్‌సీబీకి మాత్రం ప్రయోజనం చేకూరింది.
ఇటీవల భారత్-పాక్ ఉద్రిక్తతలతో 9 రోజుల పాటు నిలిచిపోయిన ఐపీఎల్ తిరిగి ప్రారంభమైన తొలి మ్యాచ్ ఇదే. కానీ ఈ మ్యాచ్ కూడా వర్షానికి తుడిపాటవడం ఆందోళన కలిగించింది.
ఇక సీజన్ ముగింపులోకి వస్తుండగా, ఎస్ఆర్‌హెచ్, సీఎస్‌కే, ఆర్ఆర్ తర్వాత కేకేఆర్ కూడా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది.