Monday, July 27, 2026
HomeMovie Newsఈ వారం ఓటీటీ, థియేటర్లలో కొత్త రిలీజ్‌లు ఇవే!

ఈ వారం ఓటీటీ, థియేటర్లలో కొత్త రిలీజ్‌లు ఇవే!

weekend-ott-theatrical-releases-akhanda-2-postponement-rashmika-mohanlal

ఈ వారం షెడ్యూల్ ప్రకారం బాలయ్య అఖండ 2: తాండవం విడుదల కావాల్సి ఉన్నా, తప్పని పరిస్థితుల్లో వాయిదా పడింది. దీంతో అఖండ మూవీకి వెళ్దామనుకున్న మూవీ లవర్స్ ఇప్పుడు నిరాశ చెందకుండా ఉండేందుకు ఓటీటీలు థియేటర్లలో కొత్త సినిమాలు అందుబాటులోకి వచ్చాయి.

తెలుగులో కొత్త సినిమాలు లేవు. అయితే థియేటర్స్ లోకి బాలీవుడ్ నుంచి రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ (యాక్షన్ థ్రిల్లర్) మలయాళం నుంచి మోహన్ లాల్ నటించిన కలాం కావల్ (క్రైమ్ థ్రిల్లర్) విడుదలయ్యాయి.

ఓటీటీలో అందరి దృష్టి నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన ది గర్ల్ ఫ్రెండ్ పై ఉంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ తెలుగు సహా వివిధ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

వీటితో పాటు సోనీ LIV లో కుట్రం పురింధివన్ – ది గిల్టీ వన్ (తమిళ వెబ్ సిరీస్), జీ5లో కేసరియా@100 (హిందీ డాక్యుమెంటరీ), ఘర్వాలి పెడ్వాలి (తమిళం) అందుబాటులో ఉన్నాయి.

ఆహాలో ధూల్‌ పేట్ పోలీస్ స్టేషన్ (తమిళం తెలుగు) అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో జటాధర (తెలుగు) వంటి చిత్రాలను మూవీ లవర్స్ ఈ వీకెండ్ చూసి ఎంజాయ్ చేయవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular