
వార్ 2 రివ్యూ & రేటింగ్: అంచనాలను అందుకుందా?
విడుదల తేదీ: ఆగస్టు 14, 2025
దర్శకుడు: అయాన్ ముఖర్జీ
తారాగణం: హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వాని, అశుతోష్ రాణా, అనీల్ కపూర్, ఇతరులు
సంగీతం: ప్రీతం (పాటలు), సంచిత్ – అంకిత్ (బిజిఎమ్)
సినిమాటోగ్రఫీ: బెంజమిన్ జాస్పర్
ఎడిటింగ్: ఆరిఫ్ షేక్
కథ:
వార్ 2, 2019లో విడుదలైన వార్ చిత్రానికి సీక్వెల్. కబీర్ (హృతిక్ రోషన్) ఒక ప్రతిభావంతమైన రా ఏజెంట్. రా చీఫ్ లూథ్రా (అశుతోష్ రాణా) అతన్ని శత్రు శిబిరంలోకి స్పైగా పంపుతాడు, కాలి అనే ప్రమాదకర ఉగ్రవాద గ్రూప్‌ను నిర్మూలించడానికి. అయితే మిషన్ మధ్యలో కబీర్ అనూహ్యంగా లూథ్రాను కాల్చి చంపుతాడు. ఇది ఎందుకు చేశాడో ప్రేక్షకులకు అర్థమవుతుందికాని, రా టీంకి మాత్రం మిస్టరీగానే మిగులుతుంది.
లూథ్రా మరణం వెనుక అసలు నిజం తెలుసుకోవడానికి మేజర్ విక్రమ్ (ఎన్టీఆర్) రా టీంలో చేరుతాడు. మొదట కబీర్‌ని వెంబడించే విక్రమ్, తర్వాత అతనితో అనుకోని పరిస్థితుల్లో కలుస్తాడు. కబీర్ మిషన్ వెనుక ఉన్న రహస్యాలు, కాలి బృందం కుట్రలు, కావ్య (కియారా అద్వాని) పాత్రలోని ట్విస్ట్.. ఇలా అన్ని కలిపి యాక్షన్ మరియు సస్పెన్స్‌తో నడిచే కథను ముందుకు తీసుకెళ్తాయి.
విశ్లేషణ:
వార్ 2 లో విజువల్స్, యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. జపాన్, జర్మనీ, సింగపూర్, దుబాయి వంటి ప్రదేశాల్లో షూట్ చేసిన సీక్వెన్స్‌లు స్క్రీన్‌పై గొప్పగా కనిపిస్తాయి. హృతిక్ రోషన్ ఎప్పటిలాగే తన స్టైల్, యాక్షన్, ఇంటెన్సిటీతో ఆకట్టుకున్నాడు.
ఎన్టీఆర్ కి ఇచ్చిన పాత్రలో విభిన్న షేడ్స్ ఉన్నాయి. మొదట పాజిటివ్, తర్వాత గ్రే షేడ్, చివర్లో మళ్లీ సర్ప్రైజ్ ట్విస్ట్.. ఇవన్నీ అతను న్యాయంగా చేశాడు. కానీ హృతిక్ పక్కన అతని స్క్రీన్ ప్రెజెన్స్ కొంచెం తగ్గిందనిపించింది. కియారా అందంతో పాటు యాక్షన్‌లో కూడా బాగానే మెరిసింది కానీ స్కోప్ పరిమితమే.
ప్రీతం ఇచ్చిన పాటలు సాధారణంగా అనిపించినా, నేపథ్య సంగీతం (బిజిఎమ్) మాత్రం థ్రిల్లింగ్‌ను పెంచింది. ప్రత్యేకంగా “సలాం అనాలి” సాంగ్ విజువల్ గ్రాండ్‌గా ఉన్నా, లిరిక్స్ సగటు స్థాయిలో ఉన్నాయి. కెమెరా వర్క్ టాప్ క్లాస్, గ్రాఫిక్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
- హృతిక్ రోషన్, ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్
- అంతర్జాతీయ లొకేషన్స్, గ్రాండ్ ప్రొడక్షన్ విలువలు
- ప్రీతం సంగీతం, బిజిఎమ్
మైనస్ పాయింట్స్:
- కథలో కొత్తదనం లేకపోవడం
- సెకండ్ హాఫ్, ఎమోషనల్ కనెక్ట్ లో లోపం
బాటం లైన్: యాక్షన్ బ్లాస్ట్ కథలో కొత్తదనం లేకపోయినా మాస్ ఆడియన్స్‌కి నచ్చే అవకాశం ఉంది.
రేటింగ్: 2.75/5
