
విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో మరో ప్రత్యేక చిత్రం రానుంది. ఆయన నటించిన లేటెస్ట్ హిట్ “సంక్రాంతికి వస్తున్నాం” తర్వాత ఫ్యామిలీ ఆడియెన్స్‌కు హిట్ కంటెంట్ అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరింత ఆసక్తికరంగా, ఈసారి వెంకీ మామతో త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి పనిచేయనున్నట్లు సమాచారం.
ఇటీవలే ఈ ప్రాజెక్ట్‌ను ఫైనల్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ కాంబినేషన్‌పై అంచనాలు భారీగా ఉండగా, తాజాగా హీరోయిన్ ఎంపికపై ఆసక్తికర బజ్ బయటకు వచ్చింది.
అది ఏంటంటే.. ‘హరిహర వీరమల్లు’, ‘ది రాజా సాబ్’ వంటి బిగ్ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్న నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా లాక్ అయినట్టు టాక్. ఈమె వెంకటేష్‌కు జోడిగా నటించనున్నదే కాక, కథలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని సమాచారం.
త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్లకు ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉండటం ప్రత్యేకత. అందుకే నిధి పర్ఫెక్ట్ ఫిట్ అవుతుందన్న అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్టు తెలుస్తుండగా, సెట్స్ పైకి తీసుకెళ్లే పనులు జూలైలో మొదలయ్యే అవకాశం ఉంది. వెంకటేష్ అభిమానులు ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై హైప్ క్రియేట్ చేస్తున్నారు.
venkatesh, trivikram srinivas, nidhi agarwal, new movie update, tollywood buzz,