Friday, April 17, 2026
HomeMovie Newsఫ్యామిలీ కథల్లో గన్ సౌండ్.. వెంకీ కొత్త ట్రెండ్!

ఫ్యామిలీ కథల్లో గన్ సౌండ్.. వెంకీ కొత్త ట్రెండ్!

venkatesh-new-trend-family-crime-movies-lineup

విక్టరీ వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ కు ఫేవరెట్ హీరో. కానీ ఇప్పుడు ఆయన రూట్ మార్చారు. కేవలం సెంటిమెంట్, ఎమోషన్స్ మాత్రమే కాకుండా అందులో కాస్త ‘క్రైమ్’ టచ్ కూడా ఇస్తున్నారు. వెంకీ తాజా లైనప్ చూస్తుంటే ఇదే విషయం క్లియర్ గా అర్థమవుతోంది.

ఈ ఏడాది వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం‘ సినిమాతోనే ఈ కొత్త ప్రయోగానికి తెరలేపారు. పైకి పండుగ సినిమా అనిపించినా, అందులో గన్ కల్చర్, క్రైమ్ కామెడీని మిక్స్ చేసి హిట్ కొట్టారు. ఆడియన్స్ కు ఈ కొత్త కాంబినేషన్ బాగా నచ్చడంతో వెంకీ అదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా టైటిల్ వింటే చాలా సాఫ్ట్ గా ఉంది. కానీ లోగోలో మాత్రం ఏకే 47, రక్తపు చుక్కలు పెట్టి షాక్ ఇచ్చారు. అంటే ఇది కూడా సాదాసీదా ఫ్యామిలీ స్టోరీ కాదని, ఇందులోనూ క్రైమ్ యాంగిల్ గట్టిగానే ఉందని హింట్ ఇచ్చేశారు.

ఇక ఈ లిస్టులో ఉన్న మరో క్రేజీ మూవీ ‘దృశ్యం 3’. ఫ్యామిలీ కోసం ఒక సామాన్యుడు చేసే క్రైమ్ ఎంత కిక్ ఇస్తుందో ఇప్పటికే చూశాం. ఇప్పుడు మూడో పార్ట్ తో ఆ థ్రిల్ ను పీక్స్ కు తీసుకెళ్తున్నారు. ఇలా వరుసగా క్రైమ్ టచ్ ఉన్న కథలనే వెంకీ ఎంచుకుంటున్నారు.

కేవలం క్లాస్ సినిమాలే కాకుండా, ఇలా మాస్ ఎలిమెంట్స్ జోడించడం వెంకీ వేస్తున్న స్మార్ట్ స్టెప్. దీనివల్ల ఫ్యామిలీస్ తో పాటు యూత్ కూడా థియేటర్లకు క్యూ కడతారు. మొత్తానికి ఈ ‘ఫ్యామిలీ విత్ క్రైమ్’ కాన్సెప్ట్ వెంకీ కెరీర్ కు కొత్త జోష్ ఇస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular