Sunday, January 18, 2026
HomeMovie Newsవీరమల్లు ప్రమోషన్లకు డైరెక్టర్ క్రిష్ ఎందుకు దూరంగా ఉన్నారు?

వీరమల్లు ప్రమోషన్లకు డైరెక్టర్ క్రిష్ ఎందుకు దూరంగా ఉన్నారు?

veeramallu-director-krish-absent-in-promotions

న్యూస్ డెస్క్: పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన హరి హర వీరమల్లు సినిమా ఈ నెల 24న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ దశలో కీలకంగా ఉన్న దర్శకుడు క్రిష్ ప్రమోషన్లలో కనిపించకపోవడం ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అవుతోంది.

ఐదేళ్ల కష్టానికి ఫలితంగా తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తొలుత క్రిష్ దర్శకత్వంలో మొదలై, ఆ తర్వాత జ్యోతి కృష్ణ చేతిలో పూర్తి అయింది. సినిమా మొత్తంలో దాదాపు 75 శాతం వరకు క్రిష్ పనిచేశారని టాక్.

అయితే ప్రస్తుతం ఆయన అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఘాటీ సినిమాలో బిజీగా ఉన్నారు. ఆ సినిమా వాయిదాలు పడుతూ రావడంతో, క్రిష్ పూర్తిగా దాని పనుల్లోనే ఉన్నారట. అందుకే వీరమల్లు ప్రమోషన్లకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కానీ అభిమానులు మాత్రం క్రిష్ ఒకసారి కనీసం ఈవెంట్‌లో కనిపిస్తారని ఆశించారు. ఎందుకంటే సినిమా పైన ఆయన శ్రమ అందరికీ తెలిసిందే. ఆయన దూరం సినిమాకు పెద్ద లోటే అని కామెంట్లు చేస్తున్నారు.

తీరా క్రిష్ ప్రమోషన్లకు రాకపోయినా, ఆయన దారి వేసిన బాటలోనే ఈ సినిమా రూపొందిందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఘాటీకి సమయం ఇచ్చిన క్రిష్, ఆ సినిమా హిట్ కావాలనే మనసుతో పని చేస్తున్నారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular