Tuesday, March 17, 2026
HomeMovie Newsడార్లింగ్‌తో చేస్తూ.. త్రిప్తి డిమ్రి మనసులో మాట ఇదే!

డార్లింగ్‌తో చేస్తూ.. త్రిప్తి డిమ్రి మనసులో మాట ఇదే!

tripti-dimri-wants-to-work-with-ntr-after-prabhas-spirit-movie

ఒకప్పుడు సౌత్ సినిమాలను చిన్నచూపు చూసిన బాలీవుడ్ ఇప్పుడు మన స్టార్స్ వైపే చూస్తోంది. బాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న త్రిప్తి డిమ్రి, ప్రభాస్ సరసన ‘స్పిరిట్’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అవుతోంది.

అయితే, ‘స్పిరిట్’ షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే త్రిప్తి డిమ్రి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. టాలీవుడ్‌లో ఏ హీరోతో నటించాలని కోరుకుంటున్నారు? అని ప్రశ్నించగా.. ఆమె తడుముకోకుండా ఎన్టీఆర్ పేరు చెప్పింది.

ఎన్టీఆర్ యొక్క ఎనర్జీ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్నానని త్రిప్తి డిమ్రి ఓపెన్‌గా చెప్పింది. అవకాశం వస్తే తప్పకుండా సినిమా చేస్తానంటూ తన కోరికను బయటపెట్టింది.

ప్రస్తుతం ప్రభాస్‌తో సినిమా చేస్తున్నా, ఎన్టీఆర్‌తోనూ నటించాలని కోరుకోవడంలో తప్పేం లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. త్రిప్తి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

‘స్పిరిట్’ గనక హిట్ అయితే, త్రిప్తికి టాలీవుడ్‌లో మరింత మంది స్టార్ హీరోలతో పనిచేసే అవకాశాలు దక్కుతాయి. ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనే ఆమె కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular