Sunday, August 16, 2026
HomeMovie Newsరామ్ చరణ్ 'పెద్ది'.. 100 మిలియన్ల 'చికిరి చికిరి' రికార్డ్!

రామ్ చరణ్ ‘పెద్ది’.. 100 మిలియన్ల ‘చికిరి చికిరి’ రికార్డ్!

ram-charan-peddi-first-single-chikiri-chikiri-100-million-views-record

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత నటిస్తున్న ‘పెద్ది’ సినిమా కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ “చికిరి చికిరి” పాట యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తోంది.

సాధారణంగా ఒక పాటకు భారీ వ్యూస్ రావాలంటే కొంత సమయం పడుతుంది. కానీ ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ రామ్ చరణ్ కలిసి ఈ రికార్డులను వేగంగా బద్దలు కొట్టారు. “చికిరి చికిరి” పాట కేవలం 12 రోజుల్లోనే అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ల వ్యూస్‌ను దాటేసింది. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన పాటగా ఇది నిలిచింది.

ఈ పాటలో తెలుగు వెర్షన్ ఒక్కటే దాదాపు 64 మిలియన్ల వ్యూస్‌ను 1 మిలియన్ లైక్స్‌ను సాధించింది. హిందీ వెర్షన్ కూడా 25 మిలియన్లకు పైగా వ్యూస్‌తో నార్త్ లో దుమ్ము రేపుతోంది.

మోహిత్ చౌహాన్ పాడిన ఈ పాటలో చరణ్ వేసిన మాస్ స్టెప్పులు హీరోయిన్ జాన్వీ కపూర్ అందాన్ని పొగుడుతూ వేసిన స్టెప్పులు మెయిన్ హైలైట్‌గా నిలిచాయి. వెంకట సతీష్ కిలారు నిర్మాణ విలువలు బుచ్చిబాబు విజువల్స్ పాట స్థాయిని పెంచాయి.

ఒక్క పాటకే ఈ రేంజ్ రికార్డులు సృష్టిస్తే, ఇక సినిమా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో అని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular