
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్. తమన్ పేరు ముందువరుసలో ఉంటుంది. అయితే ప్రతి సినిమా రిలీజ్ సమయంలో ఆయనపై కాపీ మ్యూజిక్ ఆరోపణలు రావడం సాధారణంగా మారింది. సోషల్ మీడియాలో “కాపీ తమన్” అని పిలుస్తూ నెటిజన్లు ట్రోల్స్ చేయడం ఆయనకు తీవ్ర ఇబ్బందిగా మారింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమన్ ఈ విషయంపై స్పందించారు. “గుంటూరు కారం” సినిమా సమయంలో కాపీ ఆరోపణలు ఎక్కువై, మహేష్ బాబు అభిమానులు నాపై వ్యతిరేకత చూపారని ఆయన చెప్పారు. సోషల్ మీడియాలో తాను ఎదుర్కొన్న నెగిటివిటీ వల్ల ఒక సందర్భంలో కన్నీళ్లు పెట్టుకున్నానని అంగీకరించారు.
త్రివిక్రమ్ మాత్రం అప్పుడు తనకు పెద్ద మద్దతుగా నిలిచారని తమన్ తెలిపారు. “సోషల్ మీడియాని పట్టించుకోకు, నీ పనిపైనే దృష్టి పెట్టు” అని ఆయన చెప్పారని వెల్లడించారు. ఆ ప్రోత్సాహమే తనకు బలం ఇచ్చిందని అన్నారు.
“నేను ఎప్పుడూ చెడు ఆల్బమ్ ఇవ్వలేదు. ప్రతి సినిమాలో కొత్తదనమే చూపించడానికి ప్రయత్నిస్తాను. కానీ నాపై కావాలనే కక్ష కడుతున్నారు” అని తమన్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఆయన ప్రభాస్ సినిమా “ది రాజాసాబ్”, బాలకృష్ణ “అఖండ 2”, అలాగే చిరంజీవి బాబి కాంబినేషన్ మూవీకి కూడా మ్యూజిక్ అందిస్తున్నారు.
మొత్తానికి తమన్ తనపై వస్తున్న కాపీ ఆరోపణలను ఖండించడంతో పాటు, తన మ్యూజిక్ పట్ల ఉన్న ప్యాషన్‌ను మరోసారి చాటిచెప్పాడు.
