
యువ హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ సెప్టెంబర్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా భారీ స్క్రీన్లతో థియేటర్లలోకి రానుంది. టీజర్, ట్రైలర్‌తోనే పెద్ద బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా తొలి రోజే మంచి రసీదు రాబట్టే అవకాశం ఉంది.
అదే రోజున బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురితో రాబోతున్నాడు. థ్రిల్లర్ హారర్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ కూడా దృష్టిని ఆకర్షించాయి. కేవలం తెలుగు మార్కెట్‌కే పరిమితం అవుతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మోస్తరుగా సాగుతున్నాయి. అయినప్పటికీ విభిన్నమైన కాన్సెప్ట్ కారణంగా యువతలో ఆసక్తి పెంచుతుంది.
మొదటి రోజు బుకింగ్స్ రెండింటికీ స్లోగా మొదలైనా, మిరాయ్ పాన్ ఇండియా ప్రమోషన్స్ కారణంగా వేగం అందుకుంటుందని ట్రేడ్ టాక్. కిష్కింధాపురి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మౌత్ పబ్లిసిటీపై ఆధారపడి రాణించాలి.
మిరాయ్ బడ్జెట్ పెద్దది కావడంతో మినిమమ్ ఓపెనింగ్స్ రాబట్టాల్సిన ఒత్తిడి ఉంది. మరోవైపు బెల్లంకొండకు ఈ సినిమా విజయం అత్యవసరం. భైరవం తర్వాత మరో మంచి హిట్ కావాలి.
ఇక అడ్వాన్స్ రేసులో తేజ ముందున్నా, రెండు సినిమాలు వేర్వేరు జోనర్లవి కావడంతో వసూళ్లపై పరస్పర ప్రభావం తక్కువగానే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
