
స్పోర్ట్స్ డెస్క్: WTC: స్టీవ్ స్మిత్ తన టెస్టు కెరీర్‌లో మరో అరుదైన ఘనత అందుకున్నారు. లార్డ్స్ మైదానంలో విదేశీ ఆటగాడిగా అత్యధిక టెస్టు పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించారు. సుమారు 141 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఈ స్థాయికి చేరుకున్న తొలి విదేశీ క్రికెటర్‌గా నిలిచారు.
దక్షిణాఫ్రికాతో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో 51 పరుగుల వద్ద స్మిత్ ఈ రికార్డు అందుకున్నారు. చివరికి 66 పరుగులతో నిలిచిన ఆయన క్లిష్ట పరిస్థితుల్లో ఆసీస్‌ను ఆదుకున్నారు. ఇప్పటి వరకు లార్డ్స్‌లో స్మిత్ మూడు హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలు చేశారు.
2015 యాషెస్‌లో చేసిన 215 పరుగులు ఆయన ఈ మైదానంలో వ్యక్తిగత బెస్ట్ స్కోరు. తాజా ఇన్నింగ్స్‌తో కలిపి ఐదు సార్లు 50కి పైగా స్కోరు చేసిన స్మిత్, సోబర్స్ రికార్డును సమం చేశారు. టెస్టు క్రికెట్‌లో స్మిత్ స్థానం మరింత పటిష్టమైంది.
ఈ మ్యాచ్‌లో ఆసీస్ 212 పరుగులకు ఆలౌట్ కాగా, వెబ్‌స్టర్ 72, స్మిత్ 66 చేశారు. సఫారీ బౌలర్లలో రబాడా 5 వికెట్లు, యాన్సన్ 3 వికెట్లు తీశారు.