
రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న SSMB29 చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ గురించి ప్రతీ చిన్న అప్‌డేట్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ అదిరిపోయే మ్యూజికల్ అప్‌డేట్ బయటకు వచ్చింది.
జక్కన్న సినిమాల్లో సంగీతానికి ఉండే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘బాహుబలి’, ‘RRR’ చిత్రాలకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ అందించిన ఎం.ఎం. కీరవాణినే ఈ చిత్రానికీ స్వరాలు సమకూరుస్తున్నారు. అయితే, షూటింగ్ ఇంకా కొనసాగుతుండగానే, కీరవాణి అప్పుడే మ్యూజిక్ పనులను ప్రారంభించేశారు.
ఈ ఇంట్రెస్టింగ్ లీక్‌ను ఇచ్చింది మరెవరో కాదు, కీరవాణి తనయుడు, యంగ్ కంపోజర్ కాల భైరవ. రోషన్ కనకాల ‘మౌగ్లీ 2025’ ఫస్ట్ సింగిల్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ, ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇది మహేష్ ఫ్యాన్స్‌కు డబుల్ కిక్ ఇచ్చింది.
కీరవాణి ఇప్పటికే SSMB29 పాటల రికార్డింగ్‌ను మొదలుపెట్టారని కాల భైరవ తెలిపారు. అంతేకాదు, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో తండ్రితో పాటు తాను కూడా భాగస్వామి అవుతున్నట్లు ఆయన హింట్ ఇచ్చారు. ఆస్కార్ విన్నర్ అనుభవానికి, యువ సంగీత దర్శకుడి ప్రతిభ తోడైతే, ఆల్బమ్ ఏ రేంజ్‌లో ఉండబోతుందోనని అంచనాలు పెరిగిపోయాయి.
షూటింగ్ దశలోనే మ్యూజిక్ పనులు ప్రారంభమయ్యాయంటే, రాజమౌళి ప్లానింగ్, విజన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు, విభిన్న సంస్కృతులకు తగ్గట్లుగా సంగీతం ఉండాలనే ఉద్దేశంతోనే కీరవాణి ముందుగానే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్లు నటిస్తున్న ఈ చిత్రాన్ని కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్‌ను నవంబర్ మొదటి వారంలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
