Friday, February 6, 2026
HomeMovie Newsఒప్పందం కుదిరింది.. గ్లోబల్ రిలీజ్ కి సిద్ధమైన SSMB 29!

ఒప్పందం కుదిరింది.. గ్లోబల్ రిలీజ్ కి సిద్ధమైన SSMB 29!

ssmb29-global-release-warner-bros-deal

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం SSMB 29 షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఎలాంటి లీకులు రాకుండా జక్కన్న కట్టుదిట్టంగా ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్తున్నారు.

ఇటీవల కెన్యా షెడ్యూల్ పూర్తి చేసి, రామోజీ ఫిల్మ్ సిటీలో కాశీ సెట్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని సమాచారం. మహేష్ బాబుతో పాటు ప్రధాన నటీనటులు ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.

ఈ ప్రాజెక్ట్ కు గ్లోబల్ లెవెల్ లో హైప్ తీసుకొచ్చేలా రాజమౌళి మరో కీలక నిర్ణయం తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. హాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ వార్నర్ బ్రోస్ తో ఒప్పందం కుదిరినట్లు సమాచారం. భారత్ మినహా మిగతా దేశాల్లో ఈ సంస్థే భారీ స్థాయిలో సినిమాను విడుదల చేయనుంది.

దీంతో SSMB 29 అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున ప్రేక్షకుల ముందుకు వెళ్లనుంది. త్వరలో ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

సినిమాలో మహేష్ సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్, తమిళ హీరో ఆర్. మాధవన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను, దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మొత్తానికి, ఈ గ్లోబల్ డీల్ తో SSMB 29 సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular