
టాలీవుడ్‌లోనే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనూ ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలవబోతున్నది మహేష్ బాబు – రాజమౌళి కలయికలో వస్తున్న SSMB29. ఈ సినిమా కోసం గ్లోబల్ లెవెల్లో ప్లానింగ్ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఏకంగా 120 దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్న సెన్సేషనల్ ప్లాన్ పై చర్చ నడుస్తోంది.
ఇంత భారీగా రిలీజ్ చేయాలన్న ఆలోచన ఇప్పటివరకు భారతీయ సినిమాకు లేనిది. కేవలం పాన్-ఇండియా స్థాయిలోనే కాదు, హాలీవుడ్ స్థాయిలో కూడా ఈ ప్రాజెక్ట్‌ని ప్రెజెంట్ చేయాలనేది రాజమౌళి ప్లాన్. మహేష్ బాబుకు ఇది కెరీర్ టర్నింగ్ పాయింట్ కావడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంటున్నారు.
అయితే ఇదే సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అట్లీ సినిమా గురించే కూడా పెద్ద చర్చ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్ మొదటి అప్‌డేట్ నుంచే ఇంటర్నేషనల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ తరహా బడ్జెట్, ట్రీట్మెంట్ తో వస్తుందని ఇండస్ట్రీ టాక్.
దీనితో SSMB29 గ్లోబల్ రిలీజ్ కి సమాధానం ఇవ్వగల ప్రాజెక్ట్‌గా బన్నీ-అట్లీ సినిమా నిలుస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్. అయితే రాజమౌళి, మహేష్ కాంబినేషన్ నుంచి వచ్చే స్కేలు మరో లెవెల్లో ఉంటుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మొత్తానికి, రెండు భారీ ప్రాజెక్టులు కూడా గ్లోబల్ ఆడియెన్స్ పై కన్నేసినట్టే. కానీ ఎవరి ప్లాన్ ఎక్కడికి చేరుతుందనేది కాలమే చెప్పాలి.