Saturday, March 14, 2026
HomeAndhra Pradeshజగన్‌పై చంద్రబాబు విసిరిన సవాల్ ఏడుపే: సజ్జల ఫైర్ వ్యాఖ్యలు

జగన్‌పై చంద్రబాబు విసిరిన సవాల్ ఏడుపే: సజ్జల ఫైర్ వ్యాఖ్యలు

sajjala-slams-chandrababu-challenge-to-jagan

న్యూస్ డెస్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీకి హాజరుకావాలని వైసీపీ అధినేత జగన్‌కు విసిరిన సవాల్‌ను వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన ఈ సవాల్‌ను ఒక ఏడుపులా అభివర్ణిస్తూ తీవ్రస్థాయిలో దాడి చేశారు. నిజంగా ధైర్యం ఉంటే జగన్‌కు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ సజ్జల సవాల్ విసిరారు.

ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడమే టీడీపీ భయాన్ని చూపుతోందని ఆయన వ్యాఖ్యానించారు. “ఆ హోదా ఇస్తే ప్రజల తరఫున జగన్ ఒక్కరే అందరికీ సమాధానం ఇస్తారు” అని సజ్జల స్పష్టం చేశారు. మీడియా ముందు మాట్లాడితేనే సమాధానం చెప్పలేక టీడీపీ నేతలు దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు ముప్పై ఏళ్ల పాలనపై కూడా సజ్జల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన పేరు చెప్పగానే ఎన్టీఆర్ వెన్నుపోటే గుర్తుకువస్తుందని అన్నారు. కుటుంబం, కోర్టులను మేనేజ్ చేయడంలో చంద్రబాబు చాకచక్యం అందరికీ తెలుసని ఆరోపించారు.

రైతుల ఇబ్బందులను ప్రస్తావిస్తూ సజ్జల, యూరియా కొరత రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా ఉందని విమర్శించారు. కుప్పం వంటి ముఖ్యమంత్రి స్వస్థలంలో కూడా రైతులు గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు ఈవెంట్ మేనేజ్‌మెంట్‌కే పరిమితమైపోయారని, ప్రజల్లోకి వెళ్ళడానికి భయపడుతున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. ఆయన కార్యక్రమాలు ప్రజా సమస్యలకు పరిష్కారాలు కాకుండా, కేవలం ప్రదర్శనలుగానే ఉన్నాయని విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular