
సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా, ‘పెళ్ళిసందD’ తర్వాత ‘ఛాంపియన్’గా రాబోతున్నాడు. ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా నుంచి విడుదలైన తాజా టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టీజర్ ఆద్యంతం గూస్‌బంప్స్ తెప్పించేలా ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
టీజర్ కేవలం స్పోర్ట్స్ డ్రామాగా కాకుండా, ఓ పీరియాడిక్ వార్ ఫీల్‌ను కూడా ఇచ్చింది. గుర్రపు దళాలు, యుద్ధ వాతావరణం మధ్య, “నా పేరు మైఖేల్” అంటూ ఫుట్‌బాల్ ఆడుతూ రోషన్ కనిపించాడు. విజువల్స్ చాలా రిచ్‌గా, భారీ స్థాయిలో ఉన్నాయి.
“ఒక్కడినే సెంటర్‌కు బాల్ తీసుకెళ్తా.. గోల్ కొడతా” అని రోషన్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్, టీజర్ చివర్లో పెద్ద గన్ ఎక్కుపెట్టిన షాట్ హైలైట్‌గా నిలిచాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంది.
ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. రోషన్ లుక్ చాలా ఫ్రెష్‌గా, మైఖేల్ పాత్రకు తగ్గట్టుగా కష్టపడినట్లు కనిపిస్తోంది. హీరోయిన్‌గా అనశ్వర రాజన్ చక్కగా సరిపోయింది.
జీ స్టూడియోస్, స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్స్ వంటి అగ్ర సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ భారీ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ చూశాక సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
