
IND vs ENG: గిల్ – జడేజా, సుందర్ శతకాలపై క్లాస్ రియాక్షన్
స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా అపూర్వ పోరాటంతో డ్రా సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లాండ్ భారీగా 669 పరుగులు చేసింది.
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 4 వికెట్లు కోల్పోయిన తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 103, కేఎల్ రాహుల్ 90 పరుగులతో నిలిచారు. ఆపై వాషింగ్టన్ సుందర్ 101*, రవీంద్ర జడేజా 107* అజేయ శతకాలు సాధించి మ్యాచ్‌ను సురక్షితంగా ముగించారు.
మ్యాచ్ అనంతరం గిల్ స్పందిస్తూ, ‘‘మేము పెద్ద ఒత్తిడిని ఎదుర్కొన్నాం. ఐదో రోజు పిచ్‌పై ఆట ఎలా ఉంటుందోనని కాస్త టెన్షన్ వచ్చిందనే చెప్పాలి. ఒక బంతిని తర్వాత మరొకదాన్ని క్రమంగా ఎదుర్కొనడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.
జడేజా, సుందర్ ఇద్దరూ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఆ సమయంలో డ్రా కోసం ప్రతిపాదనలు వచ్చాయి. కానీ, ఇద్దరూ సెంచరీకి దగ్గరగా ఉండగా, వాళ్లను ఆపడం న్యాయమేమీ కాదు. వాళ్లిద్దరూ పూర్తిగా అర్హులు. శతకాల అనంతరం మైదానం విడిచారు. టెస్టు క్రికెట్ అసలైన అందం అందరికీ కన్పించింది’’ అన్నారు.
గిల్ చెప్పినట్టే, ఈ సిరీస్‌లో ప్రతి మ్యాచ్ చివరి రోజుకు చేరింది. భారత జట్టు విశేషమైన పట్టుదలతో మ్యాచ్‌ను కాపాడింది. ‘‘దేశం కోసం ఆడేటప్పుడు పెద్ద స్కోర్లు చేయాలన్నదే నా లక్ష్యం. తర్వాత టెస్టులో విజయం కోసం కృషి చేస్తాం. కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం’’ అని గిల్ చెప్పాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 358
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 669
భారత్ రెండో ఇన్నింగ్స్: 425/4 (గిల్ 103, రాహుల్ 90, జడేజా 107*, సుందర్ 101*)