
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఛాంపియన్’. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ఈ సినిమా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ పాటలు యువతను ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఉన్నప్పుడు బజ్ కోసం ఒక బలమైన సపోర్ట్ అవసరం. సరిగ్గా ఇక్కడే ‘ఛాంపియన్’ టీమ్ మాస్టర్ ప్లాన్ వేసింది.
చిన్న సినిమాలకు యంగ్ హీరోల సినిమాలకు పెద్ద స్టార్స్ ప్రమోట్ చేస్తే ఆ రీచ్ వేరే స్థాయిలో ఉంటుంది. రోషన్ లాంటి ప్రామిసింగ్ హీరోకి ఇప్పుడు గ్లోబల్ స్టార్ రేంజ్‌లో సపోర్ట్ దొరికింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ‘ఛాంపియన్’ కోసం రంగంలోకి దిగుతున్నారు.
డిసెంబర్ 18న జరగబోయే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ‘పెద్ది’ పనుల్లో బిజీగా ఉన్న చరణ్, రోషన్ కోసం టైమ్ కేటాయించడం నిజంగా గొప్ప విషయం.
ఈ ప్రమోషన్ కోసం ‘చిరుత ఫర్ ఛాంపియన్’ అనే హ్యాష్ ట్యాగ్‌ను వాడుతున్నారు. రామ్ చరణ్ మొదటి సినిమా ‘చిరుత’ ద్వారా పరిచయం అయ్యారు. ఇప్పుడు అదే ‘చిరుత’ ఒక ‘ఛాంపియన్’ ను ఎంకరేజ్ చేయడానికి వస్తున్నాడనే అర్థం వచ్చేలా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ అనౌన్స్‌మెంట్‌తో మెగా ఫ్యాన్స్ అలర్ట్ అయ్యారు.
రామ్ చరణ్ రాకతో ఈ ఈవెంట్‌కు ఎక్కడ లేని క్రేజ్ వస్తుందని చెప్పవచ్చు. చరణ్ ఏం మాట్లాడతారు, రోషన్ గురించి ఏం చెబుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ హైప్ కచ్చితంగా ‘ఛాంపియన్’ సినిమాకు ప్లస్ అవుతుంది. ఓపెనింగ్స్ పరంగా ఇది రోషన్‌కు బాగా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది.
