
న్యూస్ డెస్క్: కమల్ హాసన్ విక్రమ్‌ల తరువాత విలక్షణమైన కథలకు పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరు తెచ్చుకున్న హీరో సూర్య. ‘గజిని’ బ్లాక్ బస్టర్‌తో కమర్షియల్ హిట్‌ని సొంతం చేసుకున్న ఆయన, గత కొంత కాలంగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. ‘జైభీమ్’ తర్వాత ఇప్పటి వరకు ఆయన ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు.
పాండిరాజ్‌తో చేసిన ‘ఈటీ’, కార్తీక్ సుబ్బరాజ్‌తో చేసిన ‘రెట్రో’ భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. పాన్ ఇండియా అంటూ ట్రై చేసిన ‘కంగువ’ సూర్య కెరీర్‌లోనే అత్యంత భారీ డిజాస్టర్‌గా నిలిచి షాక్ ఇచ్చింది. రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ.100 కోట్లకు మించి వసూళ్లు రాబట్టలేక తీవ్ర నష్టాలు మిగిల్చింది.
ఈ చేదు అనుభవాలను పక్కన పెట్టి, 2026లో మూడు క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని సూర్య నిర్ణయించుకున్నారు. యంగ్ డైరెక్టర్లతో కలిసి పనిచేయాలని ఆయన ప్లాన్ చేసుకున్నారు. 2026లో సూర్య నటిస్తున్న ఈ మూడు సినిమాలు వరుసగా రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి.
ముందుగా నటుడు డైరెక్టర్ ఆర్.జె. బాలాజీ డైరెక్ట్ చేస్తున్న యాక్షన్ డ్రామా ‘కరుప్పు’ రాబోతోంది. ఇది సూర్య 45వ సినిమా. ఇందులో ఆయన రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. చాలా ఏళ్ల విరామం తర్వాత త్రిష ఇందులో ఆయనకు జోడీగా నటిస్తోంది. డివోషనల్ టచ్ ఉన్న కథ కావడం వలన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
దీని తర్వాత, సూర్య తన 46వ ప్రాజెక్ట్‌ను తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేస్తున్నారు. ‘లక్కీ భాస్కర్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తరువాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. దీని తర్వాత అదే స్పీడుతో సూర్య తన 47వ ప్రాజెక్ట్‌ను జీతు మాధవన్‌తో చేయబోతున్నారు. ఈ మూడు సినిమాలతో సూర్య బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయాలని చూస్తున్నారు.
